NTV Telugu Site icon

CM KCR: ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ గుడ్ న్యూస్.. ఆ పన్ను రద్దు చేస్తామని ప్రకటన..

Kcr

Kcr

CM KCR: తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభవార్త అందించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఆటో సంబంధిత ఫిట్‌నెస్ ఫీజులు, సర్టిఫికెట్ల జారీ ఫీజులను మాఫీ చేస్తామని ప్రకటించారు. మానకొండుర్ నియోజకవర్గం తిమ్మాపూర్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కొత్త హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆటో ఫిట్ నేస్ ఛార్జీలు రద్దు చేస్తామని ఆటో రిక్షా వాళ్లకు శుభవార్త చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన మనకు ఇంకా అవి అమలు కావడం లేదని తెలిపారు. ప్రజలంతా మీ ఆయుధం ఓయు హక్కు దానిని మంచి వ్యక్తికి వేసి గెలిపించాలన్నారు. అభ్యర్థి మాత్రమే కాదు పార్టీల గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కళను సాకారం చేసిన పార్టీ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు.. అప్పటి పాలన ఎలా ఉందో ఒక్కసారి గమనించాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ప్రజలంతా అప్పుడు ఎన్టీఆర్ పెట్టిన టిడిపి పార్టీని ఎందుకు ఆదరించారని తెలిపారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ కదా 58 ఎండ్లు తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు తెలంగాణ ఇయ్యలే అన్నారు. మన తెలంగాణ కోసం 33 పార్టీల మద్దతు ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం కోసం యావత్ తెలంగాణ లోకం ఉద్యమాలు చేశాయని తెలిపారు.

2014 లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించి నప్పుడు అనేక ఆర్థిక వేత్తల సలహాలు తీసుకున్నామని తెలిపారు. అసరా ఫించన్ 1000 రూపాయలతో మెదలు పెట్టం ఇప్పుడు దాన్ని 5000 వేలకు పెంచబోతున్నమని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు రోడ్లు లేవు ఆసుపత్రులు, అంబులెన్స్ లు లేవని గుర్తు చేశారు. రైతులు సంతోషంగా ఉండాలని కరెంట్ కష్టాలతో పాటు కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అయిందని తెలిపారు. రైతు బంధు రైతు భీమా పథకాలతో రైతులకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. 24 గంటల కరెంట్ గురించి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో 20 గంటలు ఇస్తామని చెప్పి 5గంటలు ఇస్తున్నారు అందుకే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తాం అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు రద్దు చేసి మళ్ళా పాత పటేల్ పట్వారీ లను తీసుకువచ్చి దళారుల రాజ్యం తెస్తారా? అని మండిపడ్డారు. రసమయి గెలిచిన తరువాత హుజూరాబాద్ లో లాగా ప్రతి ఇంటికి దళిత బంధు నేనే వచ్చి ఇస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ICC World Cup 2023 Team: కెప్టెన్‌గా రోహిత్.. ఐసీసీ ప్లేయింగ్ 11లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!