NTV Telugu Site icon

Sai Chand Death: సాయిచంద్ మృతదేహానికి కేసీఆర్ నివాళి.. కన్నీళ్లను ఆపుకుంటూ?

Kcr Cried After Seeing Sai

Kcr Cried After Seeing Sai

CM KCR Emotional after seeing Sai Chand Dead body: ప్రముఖ సింగర్, తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతితో బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తుండగా అగ్ర నేతలు హైదరాబాద్‌ గుర్రంగూడలోని ఇంటికెళ్లి సాయిచంద్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. సాయిచంద్ మృతదేహానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయిచంద్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని వారంతా గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ సాయిచంద్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి సాయిచంద్ మృతదేహాన్ని చూసి భావోగ్వేగానికి గురైయ్యారు.

SPY Movie Review: నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’ మూవీ రివ్యూ

ఒకానొక దశలో ఉబికి వస్తున్న కన్నీటిని అదిమిపట్టుకుని అలానే చూస్తూ ఉండి పోయారు. ఇక కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెబుతుండగా కేసీఆర్‌ను పట్టుకుని సాయిచంద్ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సాయిచంద్ తండ్రిని కేసీఆర్ ఓదార్చడమే కాక చిన్న వయస్సులోనే సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. సాయిచంద్ మృతదేహానికి హరీష్ రావు, కేటీఆర్ లు ఈ ఉదయమే నివాళులు అర్పించారు. సాయిచంద్ మృతదేహాన్ని చూసి హరీష్, కేటీఆర్ ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని తాము అంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Show comments