ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నాగార్జున సాగర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన పలు విమర్శలు చేశారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, జానారెడ్డి మాటతప్పి నాగార్జున సాగర్ ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు. దేశానికే ఆదర్శంగా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధుపై ఎన్నో విమర్శలు చేస్తున్నారని, 12 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అందిస్తున్నామని అన్నారు. ఒక్కో కుటుంబానికి తప్పకుండా రూ.10 లక్షలు ఆర్ధికసాయం చేస్తామని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో వంద కుటుంబాలకు ఈ ఏడాది దళితబంధును అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధుతో పార్టీలకు గుండెదడ మొదలైందని, రాజకీయ పార్టీలకు బీపీ మొదలైందని అన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా విషయంలో జానారెడ్డి గతంలో ఎద్దేవా చేశారని సీఎం కేసీఆర్ విమర్శించారు.
Read: ఎట్టకేలకు స్పందించిన శిల్పాశెట్టి… భర్త కేసుపై సుదీర్ఘ వివరణ