Bathukamma: నేడే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ.. ఆడబిడ్డలకు సీఎం శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathukamma: తెలంగాణ ఆత్మగౌరవానికి, అద్వితీయ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా పూలను పూజించే పండుగ బతుకమ్మ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందన్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభించి చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే వరకు ఆడపిల్లలు, అబ్బాయిలు అందరూ కలిసి ఆటలు, కోలాటాలతో జరుపుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ పండుగ చాటిచెబుతుందని అన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు మహిళా సాధికారతను పెంపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు, సంతోషాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్ ప్రకృతి మాతను ప్రార్థించారు.
ఈ ఏడాది కూడా సింగపూర్‌లో జరిగే బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు ప్రతి ఇంటి నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ తరలివస్తారు. ప్రతి పువ్వుకు రాసు అని నామకరణం చేస్తూ, ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి స్థానిక తంపానీస్ సెంట్రల్ పార్కులో తెలంగాణ గ్రామీణ సాంప్రదాయ పండుగ బతుకమ్మను జరుపుకుంటున్నారు. కార్యక్రమ నిర్వాహకురాలు కురిచేటి స్వాతి మాట్లాడుతూ.. దసరా పండుగకు ముందు వారాంతం కావడంతో అందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని జరుపుకోవాలని తెలిపారు. అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రముఖ గాయకుడు వరం లైవ్ గానం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, కార్యక్రమానికి హాజరైన వారందరికీ రుచికరమైన భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటి 3 ఆకర్షణీయ బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు, ఒక అదృష్ట విజేతకు 5 గ్రాముల బంగారం అందజేస్తామని కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. మరింత సమాచారం కోసం కింది వీడియోను చూడాలని నిర్వాహకులు తెలిపారు.
Israel Palestine Conflict: లెబనాన్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో ఒక జర్నలిస్టు మృతి.. ఆరుగురికి గాయాలు
Also Read
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!