CM KCR Clarity on Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. బుధవారం జగిత్యాల పర్యటనలో కీలక ప్రకటన చేశారు. ఇంకో 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బులు పడతాయని కేసీఆర్ చెప్పారు. ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉందని.. అందులో నిర్ణయం తీసుకుని రైతుబంధు డబ్బులను విడుదల చేస్తామని అన్నారు. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదని ఆయన అన్నారు.
Read Also: Tiger Dead: వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి.. పన్నా టైగర్ రిజర్వ్‌లో ఘటన
మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో 24 గంటల వ్యవసాయ కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని.. రైతుబంధు, రైతుబీమా ఇచ్చే రాష్ట్రం తెలంగాణే అని అని అన్నారు. తెలంగాణ రైతులు బలపడాలని తీసుకున్న నిర్ణయాలే రైతుబంధు, రైతుబీమా అని అన్నారు. దేశంలో రైతుల ధాన్యాన్ని ఏ ప్రభుత్వం కూడా కొనుగోలు చేయలేదని, 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.