NTV Telugu Site icon

CM KCR : తెలంగాణలో కరెంటు పోదు

జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో పనిచేస్తేనే తెలంగాణలో ఇదంతా సాధ్యమయ్యిందని ఆయన అన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదని ఆయన అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని కేసీఆర్‌ ప్రశంసించారు. తెలంగాణలో కరెంట్‌ పోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 గ్రామాలు మనవేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు జనగామలో మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేదని, అప్పటి పరిస్థితి చూసి ఎంతో బాధపడ్డానన్నారు. రాష్ట్రం వచ్చాక పరిస్థితి మారిందని, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకున్నామని ఆయన అన్నారు. అయితే తలసరి ఆదాయం త్వరలో రూ.2.70 లక్షలకు పెరగబోతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్‌ జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఖబడ్ధార్ మోడీ..తెలంగాణ తో పెట్టుకోకు | CM KCR Public Meeting LIVE  l Jangaon l NTV LIVE