NTV Telugu Site icon

KCR: శ్రీలంక విషయంలో మాట్లాడకపోతే.. దోషిగా పరిగణిస్తాం

Modi Kcr

Modi Kcr

మోడీని చూసి పెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని, బీజేపీ ప్ర‌భుత్వం పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నేడు (శ‌నివారం) జ‌ల‌విహార్‌లో విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌భ‌ను నిర్వ‌హించారు. సీఎం మాట్లాడుతూ.. మీ కారణంగా దేశ ప్రజలు తలదించుకోవాల్సి వస్తోందని ఆగ్ర‌మం వ్య‌క్తం చేశారు. మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని మండిప‌డ్డారు. మేకిన్‌ ఇండియా అంటే ఇదేనా? అంటూ ప్ర‌శ్నించారు.పెద్ద కంపెనీలన్నీ దేశం నుంచి వెళ్లిపోయాయని విమ‌ర్శించారు. శ్రీలంక విషయంలో మీరు మాట్లాడకపోతే.. మిమ్మల్ని దోషిగా పరిగణిస్తాం మంటూ మండిప‌డ్డారు. మీరు దోషి కాదని రేపటి బహిరంగసభలో వివరణ ఇవ్వండి అంటూ కేసీఆర్ స‌వాల్ విసిరారు. రూపాయి పతనంపై మన్మోహన్‌ హయాంలో గొంతు చించుకున్నారని గుర్తు చేశారు. మరి మీ పాలనలో రూపాయి ఎలా పతనమవుతుందో రేపు మాట్లాడండని కేసీఆర్ అన్నారు. రూపాయి పతనం చేస్తే మీ పాలన ఎంత గొప్పదో అర్థమవుతుంది-కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయితే.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆత్మ‌ప్ర‌భోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈనేప‌థ్యంలో సిన్హాకు తెలంగాణ ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క‌ స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌న్నారు. సిన్హా ఉన్న‌త వ్య‌క్తిత్వంగ‌ల‌వార‌ని , న్యాయ‌వాదిగా కెరీర్‌ను ప్రారంభించార‌ని పేర్కొన్నారు. కాగా.. వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్త‌మ‌ సేవ‌లందించార‌ని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా ప‌నిచేశార‌ని అన్నారు. అంతేకాకుండా.. సిన్హాకు అన్ని రంగాల్లో విశేష అనుభ‌వ‌ముంద‌ని, భార‌త రాజ‌కీయాల్లో య‌శ్వంత్‌సిన్హాది కీల‌క‌పాత్ర అని పేర్కొన్నారు. అంతేకాకుండా మీరు ఓటు వేసేట‌ప్పుడు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థుల‌ను బేరీజు వేసుకొని నిర్ణ‌యం తీసుకోవాల‌ని , ఉన్న‌త‌మైన వ్య‌క్తి రాష్ట్ర‌ప‌తిగా ఉంటే దేశ ప్ర‌తిష్ట మ‌రింత పెరుగుతుంద‌ని తెలిపారు. అంతేకాదు.. దేశంలో గుణాత్మ‌క మార్పు తీసుకురావాల్సి ఉంద‌ని అన్నారు. నేడు ప్ర‌ధాని మోడీ న‌గ‌రానికి వ‌స్తున్నార‌ని, రెండు రోజులు ఇక్క‌డే ఉంటార‌న్నారని, ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌ధాని అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు.