Site icon NTV Telugu

దళిత బంధు ఓట్ల కోసం చేసింది మాత్రం కాదు : కేసీఆర్

మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో ఈరోజు చేరారు. ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అనంతరం మాట్లాడుతూ… నన్ను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవరని తిట్టలేదు. ఒక మాయావతి ఇంటికి 19 సార్లు పోయినా.. తెలంగాణ గురించి మాయావతికి చెప్పా.. అలాగే 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించాం అని గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పడు అనేక సమస్యలు ఉన్నాయి. కింద మీద పడి ఒక రాస్తా ఎసుకుని బయలుదేరిన. ఇప్పుడు ఊర్లు మంచిగా తయారు అయినవి… ఊర్లకు పోతే ఇప్పడు ఉండాలని అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో పండుగకు ఊర్లకు పోయి మళ్ళీ వస్తుంటే జామ్ అయితుంది అన్నారు.

ఇక ఇతర పార్టీలకు రాజకీయాలు అంటే క్రీడ… కానీ టిఆర్ఎస్ కు మాత్రం యజ్ఞం ..టాస్క్ అని చెప్పారు. దళిత బంధు తీసుకురావడానికి బలమైన కారణం ఉంది. దళిత బంధుతో ప్రారంభం అయిన ఈ యజ్ఞం ఆగదు. ఆ తర్వాత గిరిజనులకు,బీసీలకు, ఈబీసీలకు కూడా ఉంటది. దళిత బంధు కింద ఇవాళ తిరుమలగిరి మండలంకు నిధులు విడుదల చేయమని చెప్పాము అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఇక దళిత బంధు కోసం సలహాల కోసం మొదట ఫోన్ మోతుకపల్లి కి చేసిన అని చెప్పిన కేసీఆర్… నరసింహలు నాతో కలసి వస్తా అంటే రమ్మని అన్న. తెలంగాణను బాగు చేసుకోవాలన్న…చెడు చేసుకోవాలన్న మనమే ..అమెరికా వాడు వచ్చి చేయడు. రాజకీయంలో ఒకసారి గెలుస్తాం…ఒక సారి ఓడతాం ..అది పెద్ద లెక్క కాదు. వచ్చే ఏడేళ్లలో 1లక్ష 70 వేల కోట్లు దళిత బంధు కోసం పెడతాం. అది 10 లక్షల కోట్లు సంపాధిస్తుంది అని పేర్కొన్నారు. అడ్డు తగిలే శక్తులు ఉంటాయి…వాటిని తట్టుకొని ముందుకు పోవాలి. తెలంగాణ దళిత సమాజం …భారత దేశ దళిత సమాజంకు దారి చూపుతుంది అని తెలిపారు.

కష్టాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణ లక్ష్మీ స్కీమ్ తీసుకువచ్చాము కళ్యాణ లక్ష్మీ కింద కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు …నీవు ఏమి ఇస్తవు అని ఆడిగేవాళ్ళు తయారు అయ్యారు. ఏమి ఇస్తావ్ అని అడిగితే… గట్టిగా ధవడకు ఇయ్యాలి అని చెప్పారు. ఎక్కడికక్కడ కథానాయకులు అయి వీటిని అడ్డుకోవాలి. నరసింహులును ఏ స్థాయిలో వాడుకోవాలనో అట్లా వాడుకుంటా అన్న కేసీఆర్ దళిత బంధు ఓట్ల కోసం చేసింది మాత్రం కాదు. దళిత సమాజం ఉద్ధరణ కోసం ఈ స్కీమ్ తీసుకెవచ్చాము . పార్టీలు లేవు…రాజకీయాలు లేవు…దళితుడు అయితే సరిపోతుంది. దళిత బంధును ఆరు నూరు అయిన ముందుకు తీసుకుపోతాం అని పేర్కొన్నారు.

Exit mobile version