Mallu Bhatti Vikramarka: నా.. రూటే వేరు.. రేవంత్ రూట్ వేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర వేరే రూట్ లో వస్తుందని, నా పాదయాత్ర వేరే రూట్ లో ఉంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వాఖ్యలు చేశారు. అరవై శాతం టిక్కెట్లు నిర్ధారణ అయ్యాయి అనే విషయం తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. తన పాదయాత్రకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొన్ని సూచనలు చేశారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సుమారు గంటకు పైగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భట్టి సమావేశమైన ఆయన ఈ నెల 16 నుండి తాను ప్రారంభించే పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరినట్టుగా చెప్పారు. కాగా.. ఈ యాత్రకు సంబంధించి ఎంపీ వెంకట్ రెడ్డి చేసిన సూచనలను పాటించనన్నట్టుగా ఆయన తెలిపారు. ఇక.. హాత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 16వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం వరకు పాదయాత్ర చేయనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో కలిసి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించనున్నారు. నా పాదయాత్ర ఎలా పాల్గొనాలని కోమటిరెడ్డి ని ఆహ్వానించానని అన్నారు. పీసీసీ చీఫ్ పాదయాత్ర వేరే రూట్ లో వస్తుందని, నా పాదయాత్ర వేరే రూట్ లో ఉంటుందని తెలిపారు. అరవై శాతం టిక్కెట్లు నిర్ధారణ అయ్యాయి అనే విషయం నాకు తెలియదని భట్టి తెలిపారు.
Read also: Revanth Reddy: పసుపు బోర్డు తెస్తానని పత్తా లేకుండా పోయారు
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
కాగా.. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. భట్టి పాదయాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి. గతంలో వైఎస్ ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో దగ్గరగా చూసిన అనుభవం మాకు ఉందని అన్నారు. పూర్తిగా పాదయాత్ర పెట్టుకున్నావ్ జాగ్రత్తగా నడవండి అని సలహా ఇచ్చానని అన్నారు. పెద్ద సెంటర్ లలో బహిరంగ సభలు పెట్టమని సూచించానని తెలిపారు. మంచిర్యాల తో పాటు జడ్చర్ల లేదా షాద్ నగర్ లో పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాం అన్నారు. నల్గొండ లో కూడా పెద్ద బహిరంగ సభ పెట్టాలని కోరానని అన్నారు. వారు కూడా ఒప్పుకున్నారని, తర్వాత నకిరేకల్, సూర్యాపేట లలో కూడా మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టమని కోరానని తెలిపారు కోమటిరెడ్డి. ముగింపు సభకు రాహుల్ గాంధీ, లేదా ప్రియాంక గాంధీ ని పిలుస్తారా అనేది వారి ఇష్టమన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి శనివారం, ఆదివారం నేను తప్పకుండా పాదయాత్ర లో పాల్గొంటానని స్పష్టం చేశారు.
Komatireddy Venkat Reddy: భట్టి పాదయాత్రకు మీరు రండి.. నేను వస్తా..!
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!