NTV Telugu Site icon

Bhatti Vikramarka: నాగార్జునసాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: నాగార్జునసాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 89వ రోజు కొసాగుతుంది. గుర్రంపోడు మండలం చేపూరు క్రాస్ రోడ్డు నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది. గుర్రంపోడు మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కనిపించే అభివృద్ధి అంతా జానారెడ్డి హయాంలో జరిగిందే అని అన్నారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. తెలంగాణలో కనిపించే అభివృద్ధి అంతా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిందే అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేదన్నారు. తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు చెందకుండా.. కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు.

Read also: Biparjoy Effect: బిపర్‌జాయ్ తుఫాన్ దెబ్బకు 67 రైళ్లు రద్దు

9 సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ పరీక్ష నిర్వహిస్తే అది కూడా లీకేజ్ కారణంగా రద్దయిందన్నారు. కృష్ణా జలాలను నల్గొండ జిల్లాకు తీసుకురావడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సాగు నీళ్ల గురించి ప్రశ్నిస్తే మంత్రి జగదీష్ రెడ్డి దగ్గర సమాధానం లేదన్నారు. తొమ్మిది సంవత్సరాలలో ప్రజలకు ఏం లాభం జరిగిందని ప్రజలు పండగ చేసుకోవాలి? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు వెళ్లి ఎస్ఎల్బీసి పూర్తి చేయాలని ముఖ్యమత్రిని అడిగే దమ్ము శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉందా? అంటూ ప్రశ్నించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆనాడు సాగునీటి కోసం చంద్రబాబు నాయుడును నిలదీసినట్లు.. ఇప్పుడు కేసీఆర్ ను ఎందుకు నిలదీయడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాల్టి పాదయాత్రలో భాగంగా.. కట్టవారిగూడెం, పిట్టలగూడెం, కొప్పోలు, ఆవగూడం, లక్ష్మీదేవి గూడెం, మొత్తం 12.5 కిలోమీటర్ల మేర సాగనుంది. పిట్టలగూడెంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌ ఉంటుందని కాంగ్రెస్‌ శ్రేణులు తెలిపారు. లక్ష్మీదేవిగూడెం క్రాస్ రోడ్ వద్ద భట్టి విక్రమార్క రాత్రికి బస చేయనున్నారు.
Apple iPhone 14 Price Drop: ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకుంటే బెటర్! లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్

Show comments