Site icon NTV Telugu

Tension at the Assembly: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యత్నం.. లాఠీచార్జ్

Tension At The Assembly

Tension At The Assembly

నిన్న శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో VRA లు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి వీఆర్‌ఏలు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ సమావేశాల్లో pay స్కెల్ ప్రకారం జీతం ఇస్తాం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారంటూ ఆరోపించారు. Pay స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని నిరసన వ్యక్తం చేసారు. కేవలం 12 వేల లోపే ప్రస్తుతం జీతం వస్తూడడంతో VRA లు ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇతర శాఖలో VRA లను భర్తీ చేస్తాం అని కేసీఆర్ ప్రకటించడంతో.. కేసీఆర్ స్టేట్మెంట్ తో సిటీ లో ఆందోళన వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి VRA లు వరుసగా పిలుపు నిచ్చారు. అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసుల మెహరించడంతో.. ప్రగతి భవన్ నుంచి అసెంబ్లీ దారి పొడవు ఉన్న షప్స్ ని క్లోస్ చేస్తున్నారని పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ముట్టడికి వస్తున్నా వందలాది మంది VRA లను ఎక్కడిక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లయి ఓవర్ దగ్గర 200 మంది VRA లను అరెస్ట్ చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసర ప్రాతంలో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన పోలీసులు. నాంపల్లి నుండి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను దారి మల్లిస్తున్నారు.

అసెంబ్లీ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్

అసెంబ్లీ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడించిన కార్యకర్తలు. మత్స్యకారుల టెండర్లను ఆంధ్ర వారికి ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు. తెలంగాణ మత్స్యకారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేశారు. తెలంగాణ మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చలో అసెంబ్లీ

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉద్రికత్తత నెలకొంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉద్రిక్తతత చోటుచేసుకుంది. జీఓ 317 అమలు కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, 13 జిల్లాల స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. విద్యావాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులను వెంటనే నియమించాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చలో అసెంబ్లీ కి పిలుపు నిచ్చారు.

వీఆర్‌ఏ, ఉపాధ్యాయులు, కాంగ్రెస్‌,లతో అసెంబ్లీ ప్రాంతం అంతా ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకోడంతో పోలీసులు లాఠీ చార్జ్‌ చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగదని నిరసనలు తెలుపుతున్నారు.

Exit mobile version