Site icon NTV Telugu

Sarpanch Maganti Krishna: బతుకమ్మ చీరల పంపిణీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Batukamma

Batukamma

Sarpanch Maganti Krishna: బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే సండ్రా మాజీ ఎంపీ పొంగులేటి అనుచరుల మధ్య ఘర్షణతో వర్గపోరు బయట పడింది. ఖమ్మం జిల్లా కొమ్ముగడెం గ్రామం సత్తుపల్లి నియోజక వర్గంలో మాజీ ఎంపీ పొంగులేని వర్గీయుడైన సర్పంచ్‌ మాగంటి కృష్ణ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుండగా.. ఎమ్మెల్యే సండ్రా వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాసేపు వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. సర్పంచ్‌ మాగంటి కృష్ణ బతుకమ్మ చీరలు పంచకూడదంటూ ఎమ్మెల్యే సండ్రా వర్గీయులు అడ్డుకోవడంతో.. ఎంతుకు పంచకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి కృష్న దీంతో వీరిద్దరి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకోవడంతో.. ఇరువర్గాల వారిని అక్కడున్న వారు శాంతింపచేశారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం ఇచ్చే చీరల పంపిణీ కార్యక్రమం నేటితో వారం రోజులు పూర్తంయింది. సెప్టెంబర్‌ 22న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది ప్రభుత్వం. కోటి మందికిపైగా లబ్దిదారులకు చేరేలా ప్రణాళిక సిద్ధం చేసింది సర్కార్‌. 24 రకాల డిజైన్లు, 10 ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్తో చీరలను ప్రభుత్వం తయారుచేయించింది. ఇందుకోసం రూ.339 కోట్లు ఖర్చుచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం సాగుతోంది. రాష్ట్రంలోని ఈ నెల 25న నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతీ ఏటా దసరా కంటే ముందు ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాల కంటే ముందుగానే ఆడపడుచులకు బతుకమ్మ సారే పేరుతో తెలంగాణ ప్రభుత్వం కానుకను అందిస్తున్న విషయం తెలిసిందే. రేషన్ కార్డుల్లో పేరు ఉండి 18 ఏళ్లు పైబడి, అర్హులైన ప్రతీ మహిళకు బతుకమ్మ చీర అందనుంది.
Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఎన్ని ట్విస్టులో?.. బరిలో దిగ్విజయ్ సింగ్

Exit mobile version