Sadar festival: రంగారెడ్డి జిల్లాలో నార్సింగీ సదర్ ఉత్సవాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఇరు వర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నార్సింగీ మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆశోక్ యాదవ్ మధ్య వివాదం ఉద్రికత్తతకు దారితీసింది. దున్న రాజుల ఊరేగింపులో ఇద్దరి మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరి పై ఒకరు దాడి చేసుకోవడమే కాకుండా.. ఏకంగా కర్రలతో, రాళ్లతో ఇరు గ్యాంగ్ లు కొట్టుకున్నారు. స్థానిక సమాచారంతో రంగప్రవేశం చేసిన నార్సింగ్ పోలీసులు ఇరు వర్గాలను కాప్స్ చెదరగొట్టారు.ఇరు వర్గాల పై కేసులు నమోదు చేశారు. సదర్ ఉత్సవాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Read also: Vaarasudu: విజయ్ ‘వారసుడు’ వచ్చేస్తున్నాడు.. ఆఫీషియల్గా ప్రకటించిన టీం !
మాజీ సర్పంచ్ ఆశోక్ యాదవ్ ఇంటిపై వెంకటేష్ యాదవ్ గ్యాంగ్ రాళ్లతో దాడి చేయడంతో..దాడిలో ఇంటి అద్దాలు, గేటు ద్వంసమయ్యాయి. వెంకటేష్ యాదవ్ అనుచరుల దాడిలో ఆశోక్ యాదవ్, అతని ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయ్, క్యాంతమ్ సతీష్, బాలు, క్యాంతమ్ ఆశోక్, క్యాంతమ్ అరవింద్, అశోక్ యాదవ్, విజయ్, జెల్లి అరవింద్, కొండా రాము లపై కేసులు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు.మొత్తం 13 మందికి గాయాలు అవడంతో.. వారిని ఆసుపత్రికి తరించి చికిత్స అందిస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం కొమరవల్లి వద్ద కత్తులతో కొట్టుకున్న వెంకటేష్ యాదవ్, ఆశోక్ యాదవ్. ఇద్దరిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అయితే మళ్లీ సదర్ ఉత్సవాల్లో ఈ ఘర్షణ చోటుచేసుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అవడంతో ప్రమాదం తప్పింది. మాజీ సర్పంచ్ ఆశోక్ యాదవ్ ఇంటి పై నార్సింగీ మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ అనుచరుల దాడి.
Viral Video: ఇదేం తిక్కరా నాయనా.. ఏకంగా కారుకే బాంబులు పెట్టి కాల్చేశాడు