వరంగల్ లో మూడు సాహిత్య పాఠశాలలకు హాజరయ్యాను. వరంగల్ లో బంధువులు, మిత్రులు ఉన్నారు. వరంగల్ తో నాకు అవినాభావ సంబంధం ఉంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వరంగల్ కోర్టు బిల్డింగ్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ… వరంగల్ పోరాట గడ్డ. విప్లవకారులు తిరిగిన నేల. దేశానికి ప్రధాన మంత్రిని అందించిన ప్రాంతం వరంగల్ అని తెలిపారు. పొరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్ కు వందనం.
చారిత్రాత్మక సంపదకు వరంగల్ నిలయం. అద్భుతమైన ఆనవాళ్లకు వరంగల్ కేంద్రం. ఎందరో స్వతంత్ర సమరయోధులు, పోరాటాయోధులు ఇక్కడ నుంచి ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న కోర్టుల సముదాయాలను తీసివేసి అధునాతన సౌకర్యాలతో కోర్టులను నిర్మించాలని నేను సంకల్పించాను. నా ఆలోచనలు, భావాలకు అనుగుణంగా వరంగల్ కోర్టును నిర్మించారు. వరంగల్ కోర్టు భవనాన్ని మోడల్ కోర్టు భవనంగా చేసి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పంపిస్తాను అని చెప్పారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కోర్టు భవనాలు నిర్మించాలి అని చెప్పిన ఆయన… కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్న తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చి కోర్టు భవనాన్ని నిర్మించడం అభినందనీయం. సామాజిక సృహ మీద ప్రజలకు అవగాహన కలిపించాలి. కోవిడ్ జీవితాన్ని మార్చేసింది .న్యాయ వ్యవస్థ పైన కోవిడ్ తీవ్ర ప్రభావం చూపింది అని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంత కోర్టులో న్యాయ వాదులు ఇబ్బందులు పడుతున్న తీరు దృష్టికి రావడంతో మొబైల్ న్యాయ స్థానాలు ఏర్పాటు చేయాలని సూచించ్చాను.. కానీ భారత్ ప్రభుత్వం ఇప్పటికి చేయలేదు అని పేర్కొన్నారు.
