Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాలు
- పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత.. “No Stock” బోర్డులు
- సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ కారణంగా క్రూడ్ ఆయిల్ కొరత కారణంగా దేశ వ్యాప్తంగా ఇంధన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పెట్రోల్ కొరత భయాలు పెరుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత.. “No Stock” బోర్డులు దర్శనమిస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గ సప్లై ఉందన్నారు. వాహనదారులు భయాందోళనకు గురి కావొద్దని కోరారు. పలు కారణాలతో కొన్ని పెట్రోల్ బంక్ లు మూసివేసినా… సమస్య పరిష్కారం కాగానే బంక్ లు ఓపెన్ చేస్తారని సివిల్ సప్లై కమిషనర్ తెలిపారు. పక్క రాష్ట్రాల్లో కొరత కారణంగా సమీప జిల్లాల్లోని బంకులకు వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు.
Also Read
మేడ్చల్, శామీర్ పేట మండలాల్లో పలు ప్రాంతాల్లో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. అనేక పెట్రోల్ బంకుల్లో “No Stock” బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ రంగంపై ఈ కొరత ప్రభావం ఎక్కువగా పడుతోంది. ట్రక్కులు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు డ్రైవర్లు దూర ప్రాంతాలకు వెళ్లి డీజిల్ తీసుకురావాల్సి వస్తోంది. మరోవైపు, డిమాండ్ పెరగడం కూడా కొరతకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!