NTV Telugu Site icon

CI Beat The Constable: ఇక్కడేం పని నీకు.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‍పై సీఐ లాఠీఛార్జ్..

Ci Beat Conistable

Ci Beat Conistable

CI Beat The Constable: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం సీఐ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై లాఠీచార్జి చేశారు. మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ నాదర్‌గుల్‌లోని జిల్లా పరిషత్‌ పాఠశాల పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరి పోలింగ్ కేంద్రం బయట వేచి ఉన్నారు.

Read also: Air India Issues: ఫ్లైట్ లో నీటి ఇష్యూ.. స్పందించిన ఎయిర్‌ ఇండియా..

ఆదిభట్ల ఇన్ స్పెక్టర్ రఘువీరారెడ్డి పెట్రోలింగ్ వాహనంలో అక్కడికి వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ని చూడగానే కానిస్టేబుల్‌ సెల్యూట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో సీఐ కానిస్టేబుల్‌ను ‘ఇక్కడ ఏం చేస్తున్నావు’ అని ప్రశ్నించగా లాఠీతో కానిస్టేబుల్‌ను కొట్టాడు. అతన్ని దూరంగా నెట్టారు. దీంతో కానిస్టేబుల్ అక్కడి నుంచి పారిపోయాడు. హైదరాబాద్ పాతబస్తీలో గురువారం పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. చార్మినార్ కాంగ్రెస్ అభ్యర్థి మజీబుల్లా షరీఫ్ సోదరుడు సలీంపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి తనపై దాడి చేసిన ఎంఐఎం కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
New SIM Card: నేటి నుంచి మారుతున్న సిమ్ కార్డ్ రూల్స్.. అలా చేస్తే రూ.10 లక్షల జరిమానా..!

Show comments