Hyderabad: హైదరాబాద్ నగరం మహేంద్ర హిల్స్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సెప్టెంబర్ 3న ‘నైపుణ్య’ పేరుతో నిర్వహించిన అంతర్గత పోటీల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తంగా 12 స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ జనార్ధన రాజు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హాజరయ్యారు.
అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే తమ అమూల్య సందేశాన్ని విద్యార్థులకు అందించారు.
ఈ నైపుణ్య కార్యక్రమంలో మహేంద్ర హిల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ నందిత, వైస్ ప్రిన్సిపాల్ సుధ పాల్గొని బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అభినందించారు.