Site icon NTV Telugu

హైదరాబాద్ లో మరో చైనా కంపెనీ భారీ మోసం…

హైదరాబాద్ లో మరో చైనా కంపెనీ భారీ మోసం బయటపడింది. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ అధికారులు. హైదరాబాద్ కి చెందిన వారితో నకిలీ 12 కంపెనీలను సృష్టించి.. వాటి ద్వారా నకిలీ బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసాయి చైనీస్ కంపెనీలు. ఈ నకిలీ కంపెనీల ద్వారా అధిక లాభాల ఆశ చూపి.. పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారు. ఇప్పటికే 2 కోట్ల 40 లక్షల రూపాయల మోసాలకు పాల్పడ్డ ఫెక్ కంపెనీ… ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన డబ్బులను తమ విదేశీ అకౌంట్లకు ట్రాస్ఫర్ చేసుకున్నారు చైనా కేటుగాళ్ళు. అయితే ఈ ఘటన పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ అధికారులు. దాంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. హైదరాబాద్ కి చెందిన శ్రీనివాసరావు, విజయ కృష్ణ, విజయ భాస్కర్ రెడ్డి లను అరెస్ట్ చేసిన నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

Exit mobile version