Site icon NTV Telugu

Fire accident karepalli: క్లూస్ టీం అదుపులో చీమలపాడు.. ఆధారాలు సేకరిస్తున్న సిబ్బంది

Under The Control Of Clues Team

Under The Control Of Clues Team

Chimalapadu village under the control of Clues team: చీమలపాడు గ్రామంలో సంఘటన జరిగిన గుడిసె ప్రాంతాన్ని క్లూస్ టీం స్వాధీనం చేసుకున్నారు. పేలుడుపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించడానికి ఘటనా స్థలికి చేరుకుంది. పేలుడు జరిగిన గుడిసెలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తుంది.

Read also: Road Accident : నీకు భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి..

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి నేతలంతా తరలివచ్చారు. గ్రామానికి అగ్రనేతలు రాక సందర్భంగా పార్టీ శ్రేణులు పటాకులు కాల్చారు. పటాకులు కాల్చడంతో మంటలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. మంటలు చెలరేగి లోపల ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. అదే సమయంలో నివాసంలో ఉన్న సిలిండర్ పేలింది. సిలిండర్‌ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. పోలీసులు, జర్నలిస్టులకు తీవ్ర గాయాలు కాగా.. విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా 10 మంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. చికిత్స పొందుతూ ముగ్గరు మృతి చెందారు. గాయపడిన వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
Road Accident : నీకు భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి..

Exit mobile version