NTV Telugu Site icon

చిలుకూరు బాలాజీ ఆలయ దర్శన వేళల్లో మార్పులు

హైదరాబాద్ నగరానికి శివారులో ఉండే చిలుకూరు బాలాజీ ఆలయంలో స్వామివారి దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ప్రధాన అర్చకుడు రంగరాజన్ వెల్లడించారు. ఇక నుంచి ప్ర‌తి రోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుంచి 6 గంట‌ల‌కు ఆల‌యం తెరిచి ఉంటుంద‌ని తెలిపారు.

Read Also: తెలంగాణ కరోనా అప్ డేట్

కరోనా పాజిటివ్ కేసులు పూర్థిస్థాయిలో అదుపులోకి వ‌చ్చే వ‌ర‌కు ఈ టైమింగ్సే కొన‌సాగుతాయ‌ని రంగరాజన్ స్ప‌ష్టం చేశారు. ఆల‌యానికి సంబంధించి గూగుల్‌లో క‌నిపించే టైమింగ్స్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌ద్దు అని సూచించారు. వీలైనంత త్వ‌ర‌గా ఆలయ దర్శనం వేళలను గూగుల్‌లో అప్‌డేట్ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రంగరాజన్ పేర్కొన్నారు.