NTV Telugu Site icon

NarayanKhed Crime: మైనారిటీ రెసిడెన్సియల్‌ లో దారుణం.. మైనర్‌ బాలిక ప్రసవం

Narayankhed Crime

Narayankhed Crime

NarayanKhed Crime: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో మైనర్ బాలిక ప్రసవం సంచలనంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read also: Earth-like exoplanet: భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో మైనర్‌ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుటుంది.గత నెల చివరి వారంలో రెసిడెన్షియల్ స్కూల్ బాత్ రూమ్ లో బాలిక ప్రసవించింది. దీంతో ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. మీ కూతురు ప్రసవించిందని వచ్చి తీసుకుని వెళ్లాలని తెలుపడుంతో తల్లిదండ్రులు షాక్‌ కి గురయ్యారు. నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ వద్దకు హుటా హుటిన చేరుకున్నారు. మైనర్‌ బాలిక గర్భవతి కావడం ఏంటని, దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. అభం శుభం తెలియని బాలికలపైనా మీ కామ కోరికలు తీర్చుకుని జీవితం నాశనం చేస్తారా? అంటూ ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. అయినా ప్రిన్సిపాల్ కనికరం చూపలేదు. మీ బిడ్డను తీసుకుని వెళ్లాలని, ఈవిషయం బయట చెప్పకూదని బెదిరించాడు.

దీంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరయ్యారు కన్న కూతురి బతుకు నాశనం అయ్యిందని, ఈ విషయం ఊరిలో తెలిస్తే కన్నకూతురి బతుకు బజారుపాలు అవుతుందని భావించారోఏమో కానీ.. కూతురికి జన్మించిన పసి కందును ముళ్లపొదల్లో పారేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పసికందు ఏడుపు విన్న కొందరు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో శిశువును ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా అసలు విషయం వెలుగులోకి రావడంతో.. మైనారిటీ రెసిడెన్షియల్ లో బాలిక ప్రసవంపై ఆశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ప్రిన్సిపల్ మంజుల, డిప్యూటీ వార్డెన్ నసీమ్ బేగం, స్టాఫ్ నర్స్ సంధ్య లను సెక్రటరీ సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
Earth-like exoplanet: భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..