NTV Telugu Site icon

Bhadradri Kothagudem: విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి..

Bhadradri Kottagudam

Bhadradri Kottagudam

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పటిదాకా మన కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోయింది. కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక తుది శ్వాస విడిచింది. ఈ విషాదం మణుగూరు మండలం సాంబాయిగూడెంలో వెలుగు చూసింది.

Read also: Komuravelle: పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య ఆందోళన..

సాంబయ్య గూడెంలో మడకం సాయి, లిఖిత కుటుంబం నివాసం ఉంటుంది. వీరికి కల్నిష అనే మూడేళ్ల చిన్నారి ఉంది. అయితే నిన్న సాయంత్రం తల్లి లిఖిత పాపకు నిద్రపోతున్న సమయంలో తన మూడేళ్ల కూతురు కల్నిష ఇంటి బయట నిలిచిన కారు ఉన్న ప్రాంతంలో తోటి పిల్లలతో ఆడుకుంటుంది.అయితే అక్కడే వున్న కారులోకి కల్నిషా ఎక్కి ఆడుకుంటుంది. అయితే.. కారు డోర్లు ఇక్కసారిగా పడి లాక్ అయిపోయాయి. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు కూడా కల్నిషా కారులో ఉన్నట్లు గమనించిలేదు. అయితే కల్నిషా బయట పిల్లను చూస్తూ బయటికి రావడానికి అవకాశం లేకపోయింది. దీంతో కారులో ఊపిరాడక స్పృహ తప్పింది.

Read also: పురుషులకు గర్భ నిరోధక ఇంజక్షన్.. నిజమేనా..

అయితే సాయంత్రం గాలి దుమ్ములు రావడంతో తల్లిదండ్రులు తమ పాప లేదని వెతుక్కుంటూ బయటకు వచ్చారు. పాప కనిపించకుండా పోవడంతో.. చివరికి కార్లో స్పృహ తప్పిన పాప కనిపించింది. కారు లాక్ తీసిన తల్లిదండ్రులు పాపను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందనట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు పాప మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అల్లారుడి మూడేళ్ల కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mallikarjun Kharge : ప్రియాంకగాంధీ అందుకే ఎన్నికల్లో పోటీ చేయలేదు : ఖర్గే

Show comments