NTV Telugu Site icon

Talasani Srinivas Yadav: ఇకపై చెప్పడం ఉండదు సీరియస్ యాక్షన్ తీసుకుంటాము

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav: హైదరాబాద్‌ లో మరో భారీ అగ్నిప్రమాదం జరగడంతో.. భాగ్యనగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలోని వీఎస్టీ సమీపంలోని ఓ గోదాంలో దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్‌ సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శుభకార్యాలకు వినియోగించే డెకరేషన్‌ సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. మంటలు పక్కనే ఉన్న మరో గోదాంకు వ్యాపించాయి. ఓ కంపెనీకి చెందిన కేబుల్ వైర్స్‌, ప్లాస్టిక్‌ మెటీరియల్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో నగర ప్రజలు ఇలాంటి గోదాములను ఇండ్లమధ్య పెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అయితే చిక్కడపల్లి అగ్ని ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్‌ అయ్యారు. ఎన్ టీవీ తో మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా ఇంకా వ్యాపారస్తుల్లో మార్పు రావట్లేదని మండిపడ్డారు. వరుస ప్రమాదాలను చూసైనా వారిలో చైతన్యం రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకమీదట వ్యాపారస్తులకు చెప్పడం అనేది ఉండదు సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఒకరి వల్ల ఇతరులకు నష్టం జరుగుతుంటే ఎవరు ఆ నష్టాన్ని భరించే పరిస్థితిలో లేరని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా వ్యాపారస్తుల్లో మార్పు రావాలని కోరారు. రాబోయేది అసలే వేసవికాలం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని వీరు చేసే తప్పిదం వల్ల ప్రజలు భయాందోళనకు గురవతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అప్రమత్తంగా వుండాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చారించారు.

Read also: Occult Worship: క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తికి దేహశుద్ది.. పోలీసులు ఎంట్రీతో..

జనవరి 19న సికింద్రాబాద్ లోని రామ్‌గోపాల్‌ పేట్‌ లో భారీ అగ్నిప్రమాదం ఒక్కసారిగా భాగ్యనగరం ఉలిక్కిపడేలా చేసింది. డెక్కన్‌ నైట్‌ వేర్‌ స్టోర్‌ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో.. ముగ్గురిని సేఫ్‌ గా బయటకు తీసుకురాగా.. మిగతా ముగ్గురి జాడలో ఒకరిని మాత్రమే గుర్తించారు. అయితే బిల్డింగ్‌ మొత్తం భారీగా అగ్నిప్రమాదానికి ఆహుతైంది. దీంతో బిల్డింగ్‌ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉన్నందున్న షాపింగ్‌ మాల్‌ను కూల్చేందుకు అధికారులు సిద్దమయ్యారు. పక్కనే ఇల్లు ఉండటంతో చాలా ఇబ్బందిగా మారింది. అయితే అక్కడే నివాసం ఉంటున్న వారికి వేరే ప్రాంతాలకు తరలించారు. బిల్డింగ్‌ కూల్చివేస్తున్నారు. ఆ గటన జరిగి 15రోజులు కావస్తున్నా ఇప్పటికి ఆఘటన మర్చిపోకముందే మళ్లీ ఇంతటి భారీ అగ్నిప్రమాదం జరగడంతో నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఇలాంటి అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ప్రతిఒక్కరికి ప్రశ్నగా మారింది.
Amit Shah tour in Telangana: మరోసారి మోడీ టూర్​​ క్యాన్సిల్​.. 11న అమిత్‌ షా పర్యటన

Show comments