NTV Telugu Site icon

TG TET 2024 Results: టీజీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

TG TET 2024 Results: టీజీ టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టీజీ టెట్-2024కు 2,86,381 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. అర్హత సాధించిన 57,725 అభ్యర్థులు కాగా.. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% కాగా.. పేపర్-2లో 34.18% అర్హత సాధించిన వారు
https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 2023తో పోలిస్తే పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగిందని సీఎం రేవంత్ అన్నారు. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది

Read also: Ponnam Prabhakar: గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది..

ఇప్పటికే తెలంగాణలో టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం జూలై నెలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ టెట్ పరీక్షలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో టెట్ పరీక్షకు మంచి డిమాండ్ ఉంది. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాయాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అందుకే B.D., D.Ed పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రతిసారీ పెద్ద సంఖ్యలో పోటీపడతారు. మరోవైపు ఎన్నికలకు ముందు టెట్ పరీక్షను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఫలితాలను ప్రకటించలేదు.

Read also: Ponnam Prabhakar: గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది..

టెట్ ఫలితాలను ఇలా తనిఖీ చేయండి

* తెలంగాణ టెట్ 2024 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

* హోమ్‌పేజీలో కనిపించే TS TET 2024 ఫలితాల ఎంపికపై క్లిక్ చేయండి.

* మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, ఫలితాలను పొందండిపై క్లిక్ చేయండి.

* మీ స్కోర్ కార్డ్ ఇక్కడ ప్రదర్శించబడుతుంది.

* ప్రింట్ డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా కాపీని పొందవచ్చు.

* టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో టెట్ స్కోర్ ముఖ్యం.

* భవిష్యత్ సూచన కోసం టెట్ స్కోర్ కార్డ్ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Rajasthan : ఇన్ స్టాలో లవ్.. ఐదుగురు పిల్లలను వదిలి ప్రియుడి వద్దకు చేరిన వివాహిత