NTV Telugu Site icon

Siddipet Murder Case: చికెన్‌ సెంటర్‌ యజమాని హత్యకేసు.. నిందితులు వారే..

Siddipet Murder Case

Siddipet Murder Case

Siddipet Murder Case: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో చికెన్‌ సెంటర్‌ నడుపుతున్న వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 21న జరిగిన చికెన్ సెంటర్ ఓనర్ మహిపాల్ రెడ్డి (42) హత్య కేసులో పురోగతి లభించింది. చికెన్ సెంటర్ లో పని చేసే వ్యక్తులే హత్య చేసినట్టు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఓనర్ ని షాపు లోపలికి పిలిచి డబ్బుల కోసమే హత్య చేసినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. హత్య చేసిన తర్వాత సీసీ కెమెరాల ధ్వంసం చేసి నిందితులు అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు పారిపోయినట్లు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read also: Kondagattu: ఆర్జిత సేవలు లేవన్నారు.. ప్రత్యేక పూజలు, దర్శనాలు ఏంటని భక్తుల ఆగ్రహం

అసలు ఏం జరిగింది..

ఉమ్మడి తూప్రా ఎన్ మండలం వెంకటాపూర్ పీటీ గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి(40) మండల కేంద్రంలోని ఉపాధ్యాయ కాలనీలో ఉంటూ చికెన్ సెంటర్ ఏడాదిన్నరగా అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. 30 రోజుల క్రితం బీహార్‌కు చెందిన కురబల్, రూబల్ అనే ఇద్దరు యువకులను చికెన్ సెంటర్ లో పని చేసేందుకు నియమించుకున్నాడు. ఆదివారం కావడంతో మధ్నాహ్నం భోజనానికి మృతుడు మహిపాల్ రెడ్డి సాయంత్రం 4 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో భార్య మానస ఫోన్ చేసి త్వరగా రమ్మని గుర్తు చేసిందని తెలిపారు. అయితే ఒక ఆర్డర్ వచ్చిందని అది ఇచ్చేశాక వస్తానని తెలిపిన మహిపాల్ కాల్ కట్ట చేశాడు. సాయంత్రం 6 గంటలు అయినా మహిపాల్ ఇంటికి రాలేదు దాంతో భార్య మళ్లీ కాల్ చేసింది. మహిపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పని ఎక్కువ కావడంతో ఫోన్ లిప్ట్ చేసివుండరని భావించిన బార్య, మృతుడి సోదరుడు శ్రీపాల్‌రెడ్డి కి తెలిపింది దీంతో రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది.

Read also: Kondagattu: ఆర్జిత సేవలు లేవన్నారు.. ప్రత్యేక పూజలు, దర్శనాలు ఏంటని భక్తుల ఆగ్రహం

దీంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు చికెన్ సెంటర్ లో పనిచేస్తున్న కురబల్, రూబల్‌లకు ఫోన్ చేయగా వారి ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. పక్కనే ఉన్న దుకాణదారులను పిలిపిస్తే దుకాణం మూసి వేసిందని చెప్పారు. సోమవారం ఉదయం జగదేవ్‌పూర్ కొచ్చి కుటుంబ సభ్యులు షెట్టార్‌ను తెరిచి చూడగా మహిపాల్‌రెడ్డి హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గజ్వేల్ సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ ఐ చంద్రమోహన్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించగా కాళ్లు, చేతులు వైర్లతో కట్టి నోటికి గుడ్డ పెట్టి దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. షాపులోని సీసీ కెమెరాల్లో హార్డ్ డిస్క్ ధ్వంసమైనట్లు గుర్తించారు. వాటితో పాటు మద్యం సీసాలు, కాల్చిన సిగరెట్లు లభ్యమయ్యాయి. బృందంతో క్షుణ్ణంగా పరిశీలించగా అందులో పనిచేస్తున్న యువకులు పరారీలో ఉండడంతో వారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
BRS KTR: నేడు వరంగల్ కు కేటీఆర్..!

Show comments