పేదరికంతో మంచి విద్యకోసం ప్రభుత్వ గురుకుల్ పాఠశాలలకు వచ్చే పిల్లలకు నరకం కనిపిస్తోంది. తినేందుకు తిండి దొరకడం లేదు. ఆహారం కూడా కలుషితం కావడంతో విరేచనాలు, వాంతులకు గురవుతున్నారు. శుభ్రత మచ్చుకైనా లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల గురుకుల హాస్టల్ విద్యార్థినిలు అవస్థలు ఇవి. కలుషిత ఆహారం ఫుడ్ పాయిజన్ తో రోగాల బారిన పడుతున్నారు. గురుకుల పాఠశాలలో ఉందామన్నా అక్కడ వాటర్, కరెంట్ లేక అవస్థలు పడుతున్నారు విద్యార్థినిలు
రాత్రి భోజనంలో పురుగులు అంటూ రోగాల బారిన పడుతున్నామని గురుకుల విద్యార్థినిలు భయంతో తల్లిదండ్రులకు చెబుతున్నారు. చేవెళ్ళ మండలంలోని ఊరెళ్ల సమీపంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో మంగళవారం రాత్రంతా విద్యుత్ మరియు నీరు సరాఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు సకాలంలో స్పందించ లేదని ఉపాధ్యాయులు తెలిపారు. చేవెళ్ల మండలం లోని ఊరెళ్ల సమీపంలో బీసీ గురుకుల పాఠశాలలు బొంరాస్ పేట్, షాబాద్ మండలాలకు చెందిన హాస్టళ్లు సాగర్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్నాయి. ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో తల్లిదండ్రులు తమపిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు.
విద్యార్థినిలు మంగళవారం రాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. బుధవారం రోజంతా విద్యుత్ రాకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలకృత్యాలకు సైతం నీరులేక పోవటంతో అవస్ధలు పడుతున్నామని గత మూడు రోజుల నుండి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని వారు తెలిపారు. ఇక్కడ దాదాపు 1021 మంది విద్యార్థినీలు చదువుతున్నారు. తమ ఇబ్బందులు తీర్చాలని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
Virat Kohli: క్రేజ్ అంటే ఇదే.. మెగాస్టార్ చిరంజీవి పాటలకు విరాట్ కోహ్లీ డ్యాన్స్
