Site icon NTV Telugu

Bus Conductor Radha : అంతా క్షణాల్లో జరిగిపోయింది.. ఆ భయానక ఘటనను వివరించిన కండక్టర్‌..

Bus Accident

Bus Accident

Bus Conductor Radha : చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ బస్సు కండక్టర్ రాధ ఆ భయానక ఘటనను కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు. కండక్టర్ రాధ మాట్లాడుతూ.. “అంతా క్షణాల్లో జరిగిపోయింది. టిప్పర్ చాలా వేగంగా వస్తున్నదని నేను, మా డ్రైవర్ గమనించాము. డ్రైవర్ బస్సును కిందకు తిప్పే ప్రయత్నం చేశాడు.. అలా చేయకపోయి ఉంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేవారు” అని చెప్పారు.

Groww Success Story: ఓ రైతు కొడుకు రూ.70 వేల కోట్ల కంపెనీకి అధిపతి అయ్యాడు..!

“చిట్టేపల్లి దగ్గర ఒక మహిళ బస్సులో ఎక్కింది. వికారాబాద్ దగ్గర ముగ్గురు పోలీసులు ఎక్కారు, తరువాత వారు దిగిపోయారు. అందరూ సంతోషంగా తమ పనులకెళ్లడానికి బయల్దేరారు. ఒక్క క్షణంలోనే అంతా చిధ్రం అయిపోయింది. ఆ తర్వాత ఏమైందో గుర్తులేదు” అని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు లోపల కలిగిన పరిస్థితులను రాధ వర్ణిస్తూ.. “డ్రైవర్ వెనుక కూర్చున్న వాళ్లపై చాలా కంకరాళ్లు పడ్డాయి. నేను పక్కకు పడిపోయాను. ఓ వ్యక్తి నన్ను లాగి కాపాడాడు. తల నుంచి రక్తం కారుతుండడంతో నా చున్నీతో నేనే కట్టుకున్నాను” అని వివరించారు.

ఫడ్రైవర్ దస్తగిరి చాలా మంచివాడు. డ్రైవింగ్‌లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు. నన్ను అక్కా అని పిలిచేవాడు. ఇవాళ మధ్యాహ్నం రమ్మని అడిగితే ‘రాలేను అక్కా’ అన్నాడు. అంతలోనే ఇంత పెద్ద విషాదం జరగడం చాలా బాధగా ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే వెనుక వస్తున్న వాహనాలు, జేసీబీ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయని, బస్సు, టిప్పర్ వాహనాలను పక్కకు తొలగించి గాయపడిన వారిని బయటకు తీయడం జరిగినట్లు రాధ వివరించారు.

Darshan Case: కన్నడ స్టార్ దర్శన్, పవిత్ర గౌడలపై హత్య, కుట్ర అభియోగాలు..

Exit mobile version