NTV Telugu Site icon

Vikarabad: వికారాబాద్ జిల్లాలో చిరుత పులి కలకలం.. వ్యక్తిపై దాడి

Vikarabad

Vikarabad

Vikarabad: వికారాబాద్ జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుత భయాందోళనకు గురిచేస్తుంది. గ్రామ శివారులో బహిర్ భూమికి వెళ్లిన శేఖర్ అనే వ్యక్తి పై చిరుత దాడి చేసింది. దీంతో శేఖర్‌ చిరుత పోరాడాడు. తన ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి పరుగులు పెడుతూ వస్తున్నా చిరుత శేఖర్‌ ను వదలలేదు. అయితే చిరుత దాడి నుంచి శేఖర్‌ తప్పించుకునే యత్నంలో తీవ్ర గాయాలయ్యాయి. శేఖర్‌ పరుగులు పెడుతూ, అరుస్తూ ఇంటి వద్దకు చేరుకున్నాడు. దీంతో స్థానికులు శేఖర్‌ అరుపులు విని బయటకు వచ్చారు.

Read also: Parliament Monsoon Session: జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..?

చేతికి తీవ్ర గాయాలైన శేఖర్ ను కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఎవరు వెళ్లకండి.. అక్కడ చిరుతపులి తిరుగుతుందని శేఖర్‌ చెప్పడంతో ప్రజలు భయాందోళన గురయ్యారు. ఏ నిమిషంలో చిరుత దాడి చేస్తుందో అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చిరుతకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటరిగా ఎవరు వెళ్లకండి అంటూ స్థానికులకు సూచించారు. బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. పిల్లలను బయట వద్దలకూడదని తెలిపారు.
Harom Hara Review : సుధీర్ బాబు హరోం హర రివ్యూ.. హిట్ కొట్టాడా?