Vikarabad: వికారాబాద్ జిల్లాలో చిరుత పులి కలకలం.. వ్యక్తిపై దాడి
- వికారాబాద్ జిల్లాలో చిరుత పులి కలకలం
- శేఖర్ అనే వ్యక్తి పై చిరుత దాడి- చేతికి తీవ్ర గాయాలు
- మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అటవీశాఖ అధికారులు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: వికారాబాద్ జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుత భయాందోళనకు గురిచేస్తుంది. గ్రామ శివారులో బహిర్ భూమికి వెళ్లిన శేఖర్ అనే వ్యక్తి పై చిరుత దాడి చేసింది. దీంతో శేఖర్ చిరుత పోరాడాడు. తన ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి పరుగులు పెడుతూ వస్తున్నా చిరుత శేఖర్ ను వదలలేదు. అయితే చిరుత దాడి నుంచి శేఖర్ తప్పించుకునే యత్నంలో తీవ్ర గాయాలయ్యాయి. శేఖర్ పరుగులు పెడుతూ, అరుస్తూ ఇంటి వద్దకు చేరుకున్నాడు. దీంతో స్థానికులు శేఖర్ అరుపులు విని బయటకు వచ్చారు.
Read also: Parliament Monsoon Session: జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..?
Also Read
చేతికి తీవ్ర గాయాలైన శేఖర్ ను కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఎవరు వెళ్లకండి.. అక్కడ చిరుతపులి తిరుగుతుందని శేఖర్ చెప్పడంతో ప్రజలు భయాందోళన గురయ్యారు. ఏ నిమిషంలో చిరుత దాడి చేస్తుందో అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చిరుతకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటరిగా ఎవరు వెళ్లకండి అంటూ స్థానికులకు సూచించారు. బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. పిల్లలను బయట వద్దలకూడదని తెలిపారు.
Harom Hara Review : సుధీర్ బాబు హరోం హర రివ్యూ.. హిట్ కొట్టాడా?
- Tags
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..