NTV Telugu Site icon

Cheddi Gang: మళ్ళీ వచ్చేసారు జాగ్రత్త.. సంగారెడ్డిలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

Sagareddy Chaddi Ganag

Sagareddy Chaddi Ganag

Cheddi Gang: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, రామచంద్రాపురంలోని పలు కాలనిలో వరుస దొంగతనాలకు గ్యాంగ్ పాల్పడుతుంది. చెడ్డీలు వేసుకుని, చేతిలో మారణయుధాలతో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. అమీన్ పూర్ లోని పనోరమ కాలనిలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలోకి చొరబడి 11 తులాల బంగారం, 10 వేల నగదు ఎత్తుకెళ్లారు. చెడ్డీ గ్యాంగ్ సంగారెడ్డిలో సంచరిస్తున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చెడ్డి గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సంగారెడ్డిలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌ చల్‌ చేస్తుండటంతో బాబోయ్‌ మళ్లీ వచ్చారంటూ ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.

వరుస దొంగతనాలు..

జనవరి 20 మహబూబ్ నగర్ జిల్లా

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. బృందావన్ కాలనిలో వరుస దొంగ తనాలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం దోపిడీ చేశారు. గతంలో కూడా అదే కాలనిలో చోరీకి చెడ్డి గ్యాంగ్ విఫలయత్నం కావడంతో వెనుతిరిగారు. రాత్రి పూట ఇళ్లలో చాకచక్యంగా చొరబడి డబ్బులు, నగలు దొంగతాలకు పాల్పడుతుండటంతో మహబూబ్ నగర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటికి తాళం వేయాలంటేనే జంకుగుతున్నరు. దీనిపై బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగ తనానికి వచ్చిన చెడ్డి గ్యాంగ్ వీడియో లు సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి.

జనవరి 15 జగిత్యాల జిల్లా

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తండ్రియాల బ్రాంచ్ ఏటీఎమ్ లో భారీ చోరీకి పాల్పడ్డారు దుండుగులు. అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఏటీఎం పగలగొట్టి సుమారు 19 లక్షల వరకు దుండగులు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కూతవేటులోనే ఉన్న ఏటీఎం సెంటర్ లో జరగడం కలకలం రేపింది. ముందస్తు ప్లాన్‌ వేసుకున్నా దుండగులు సీసీ కెమెరాలను మూసివేసేసి చోరీకి పాల్పడ్డారు. అర్థరాత్రి కావడంతో వారి పని సులువుగా కానించారు. మెల్లగా బయటకు పరారవుదామనుకునే లోపే అక్కడున్న స్థానికులు వారిని గమనించి పోట్రోలింగ్‌ పోలీసుకుల సమాచారం ఇచ్చారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్‌ చేసి అదుపులో తీసుకున్నారు.

Read also: America: తూర్పు తీర రాష్ట్రాలను వణికిస్తున్న తుఫాన్.. అంధకారంలో ప్రజలు

జనవరి 13 న ఎల్‌బినగర్‌

తాజాగా.. ఎల్‌బినగర్‌లో చైన్‌ స్నాచర్లు తెగబడ్డారు. బ్యాగును భుజాన వేసుకుని వెళుతున్న 50ఏళ్ల వృద్ధురాలిని టార్గెట్‌ చేశారు. వారి ఎదురుగా వెళుతూ తన మెడలో గొలుసు వుందని గమనించారు. కారు పక్కన బైక్‌ ఆపి ఆమె మెడలో వున్న బంగారం గొలుసును తెంచుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఆమె అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు తులాల బంగారం గొలుసు తెంపుకెళ్లారని వాపోయింది. ఎల్.బి. నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫోటేజ్‌ ఆధారంతో దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జనవరి 8 సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో..

సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హల్‌ చల్‌ చేసి గంట వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ కి పాల్పడిన ఘటన నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గంటల వ్యవధిలో 6 చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు గల్లీలో రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌, ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ హడలెత్తిస్తున్నాయి. గంటలోనే ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ లలో చైన్‌ స్నాచింగ్‌ జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నవారిని టార్గెట్‌ చేస్తూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చైన్‌ స్నాచింగ్‌ చేస్తూ కళ్లుమూసి తెరిచేలోగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది.

గత ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌

గత ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో సంగారెడ్డి, రంగా రెడ్డి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ సంచరించడం కలకలం రేపింది. మీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. కాగా.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడం కలకలం రేపింది. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న మై హోం వెంచర్‌లో ఓ ఇంటి సమీపంలో నలుగురు సభ్యులు ఉన్న ముఠా చేతిలో మారణ ఆయుధాలతో సంచరించడం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారు చెడ్డి గ్యాంగ్ ల ఉండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
498 BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ రీఛార్జ్ ప్లాన్.. రూ. 498తో 6 నెలల వ్యాలిడిటీ!