NTV Telugu Site icon

Rajagopal Reddy: నేను అనుకున్న మోజారిటీ రాలేదు..

Komati Reddy Rajagopal Reddy

Komati Reddy Rajagopal Reddy

Rajagopal Reddy: చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదని సహనం వ్యక్తం చేశారు. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు. చివరికి వరకు హోరా హోరీ తప్పకపోవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకైతే టీఆరెఎస్ ఆధిక్యంలో ఉందని అన్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని తెలిపారు.బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. నాలుగు రౌండ్‌ లు అయిపోయే సరికి టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉందని అన్నారు. చౌటుప్పల్‌ రూరల్‌ నారాయణ్‌ పూర్‌ గ్రామంలో బీజేపీ మెజార్టీ వస్తుందని నమ్మకం ఉండేదని అన్నారు. 4 రౌండ్లలో టీఆర్‌ ఎస్‌ మెజార్టీ వున్నా ఇంకా 11 రౌండ్లు వున్నాయని అన్నారు. తప్పకుండా ఇది హోరా హోరీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మునుగోడు ప్రజల కోసం వేచి చూడాల్సిందే అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.

Read also: CM Priyamani : ముఖ్యమంత్రి రేసులో హీరోయిన్ ప్రియమణి.. ఆల్ ది బెస్ట్ అంటున్న అభిమానులు

ఉదయం 8గంటలకు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్‌ కు నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌ 228, బీజేపీ 224, బీఎస్సీ-10, ఇతరులకు 88 ఓట్లు పోల్‌ అయ్యాయి. తొలి రౌండ్‌ లో టీఆర్ఎస్‌ కు 1192 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉంది. ఫస్ట్‌ రౌండ్‌ లో టీఆర్‌ఎస్‌ కు 6,096 ఓట్లు రాగా, బీజేపీకి 4904, కాంగ్రెస్‌కు 1877 ఓట్లు వచ్చాయి నియోజక వర్గంలో 2,41,855 ఓటర్లు ఉండగా.. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25, 878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూలేని విధంగా 93.41శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4గంటల వరకు తుదిఫలితం వెల్లడి కానుంది. ఓట్ల లెక్కింపు మొదట్లో బీజేపీకి ఓట్లు వచ్చిన, రౌండ్‌ రౌండ్‌ కు టీఆర్‌ఎస్‌ ఆధిక్యం లోకి రావడం విశేషం.
Extramarital Affair: ఎఫైర్ మోజులో భార్య.. మృత్యువాత పడ్డ భర్త.. కట్ చేస్తే!