Charlapalli Murder: మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్న ప్రమీల#Charlapalli Murder: చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సంచిలో లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ఈ హత్య వెనుక ఆమెతో సహజీవనం చేస్తున్న ఒక బెంగాలీ యువకుడి పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పలు సీసీటీవీ ఫుటేజ్‌లు లభ్యం కావడంతో కేసు విచారణ మరింత వేగవంతమైంది.
Madhya Pradesh: మహిళను వరించిన అదృష్టం.. ఏకంగా 8 వజ్రాలు దొరికాయి..
పది సంవత్సరాల క్రితం తన భర్త నుంచి దూరంగా ఉంటున్న ప్రమీల, కొండాపూర్‌లో మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే, ఇటీవల ఆమెకు ఒక బెంగాలీ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ యువకుడితో కలిసి కొండాపూర్‌లో నివాసం ఉంటున్న సమయంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమీలను హత్య చేసిన ఆ యువకుడు, ఆమె మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి, ఆటోలో ఏకంగా 37 కిలోమీటర్లు ప్రయాణించి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చాడు.
రైల్వే స్టేషన్ గోడ పక్కన మృతదేహంతో ఉన్న సంచిని ఉంచిన నిందితుడు, స్టేషన్‌లో ఉన్న వెయిటింగ్ హాల్‌లోకి వెళ్లి స్నానం చేసి, బట్టలు మార్చుకున్నాడు. అనంతరం, అస్సాం వైపు వెళ్లే ఒక రైలు ఎక్కి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. మృతదేహం తీసుకొచ్చిన ఆటోను కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆ బెంగాలీ యువకుడే ప్రధాన నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ యువకుడిని త్వరలో పట్టుకుని, హత్యకు గల అసలు కారణాలను తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Taliban Rejects US Proposal: అమెరికాను ఛీ కొట్టిన తాలిబన్లు.. ఇది అగ్రరాజ్యానికి అవమానమే!
