పోడు రైతుల చలో ప్రగతిభవన్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజామున సర్పంచ్ మడకం స్వరూప సహా గ్రామస్థులను అరెస్ట్ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోరుతూ చలో ప్రగతిభవన్కు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే, ఎంపీపీ తక్షణమే రాజీనామాలు చేయాలని పోడు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే నిన్న గతంలో లాగే పోడు వ్యవసాయం చేసేందుకు గిరిజనులు సన్నద్ధం కావడంతో.. అధికారులు వీరిని అడ్డుకుకోవడంతో.. గిరిజనులు, అధికారులు మధ్య ఉద్రిక్త నెలకొంది. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించడంతో ఈవివాదం నెలకొంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అయితే ఒడిశా, చత్తీస్ గఢ్ నుంచి 30 ఏళ్ల క్రితం ఒడిశా, చత్తీస్ గఢ్ నుంచి నివాసం ఏర్పాటు చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నామని వాపోయారు. ఈ ఘటనకు సర్పంచ్ మడకం స్వరూప స్పందించారు. నేడు చలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వీరిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
