NTV Telugu Site icon

Chada Venkat Reddy: సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్‎కు అధికారం.. చాడా సంచలన వ్యాఖ్యలు

Chada Venkat Reddy

Chada Venkat Reddy

Chada Venkat Reddy: తెలంగాణలో సీపీఐ పొత్తుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైందన్నారు. నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాని కావాలనే ఉద్దేశ్యం తో అవసరమైన పద్ధతుల్లో అడ్డదారులు తొక్కుతున్నారని తెలిపారు. బీజేపీ నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే ఇప్పటికంటే దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర వహించి ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోలని చర్చలు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించి ఆ దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

Read also: Gidugu Rudra Raju: చంద్రబాబు, డీకే శివకుమార్‌ భేటీ.. గిడుగు ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో సీపీఐ పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు విజయంవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మరో వైపు ఖజానా దివాళా తీసిందని, కొత్త ప్రభుత్వం పై ప్రజలకు కొండంత ఆశ ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరతంగా కాకుండా నిర్మాణత్మకంగా అడుగులు వేస్తుందని బావిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సమయంలోనే ప్రగతి భవనం ఇనుప కంచెలను తొలగించడం నేను ఆశ్చర్యపడ్డా అని అన్నారు. ఇనుప కంచెలను తొలగించడంతో సంతోషపడ్డ అన్నారు. ఇది సీపీఐ ప్రధాన డిమాండ్ అన్నారు. సింగరేణి ఎన్నికల్లో కార్మికుల పక్షపాత సంఘాన్ని ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
Hyderabad Gold ATM: అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో గోల్డ్ ATM.. ఎన్ని గ్రాములు కొనచ్చంటే?