NTV Telugu Site icon

Vemulawada: భక్తులకు అలర్ట్.. రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత

Rajnna Sirisilla

Rajnna Sirisilla

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అధికారులు భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. గర్భగుడిలో సేవలను నేడు, రేపు (డిసెంబర్ 18) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు కొనసాగనుంది. భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జాతర పూర్తయ్యే వరకు ఆది, సోమవారాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో సమ్మక్క సారలమ్మ భక్తుల సంఖ్య తక్కువగా ఉంటే మిగిలిన భక్తులకు గర్భగుడిలో అభిషేకం, అన్నపూజలు చేసుకునేందుకు టిక్కెట్లు ఇస్తామని తెలిపారు.

Read also: Harirama Jogaiah: టీడీపీ-జనసేన బంధాన్ని బలహీన పర్చేందుకు వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు

మిగిలిన రోజుల్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆర్జిత సేవల వివరాలను దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఈవో వెల్లడించారు.బేడా మండపంలోని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అధ్యయనోత్సవం నిర్వహించారు. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు నరసింహావతారంలో దర్శనమిచ్చారు. స్వామి నేడు వామనావతారంలో దర్శనమివ్వనున్నారు. ధనుర్మాసంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుప్రభాతం, ఆరాధన, అభిషేకం, తిరుప్పావై సేవ ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.
Jeevan Reddy: ప్రేమ వలకపోస్తే ఆశ్చర్యంగా వుంది.. హరీష్‌ రావుపై జీవన్‌ రెడ్డి వ్యంగాస్త్రం

Show comments