Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Centre Delaying Booster Dose With Stock Nearing Expiry

Harish Rao: బూస్టర్‌ ఎప్పుడు?.. అనుమతిస్తే వేస్తాం..!

Published Date :June 14, 2022 , 9:50 am
By NTV WebDesk
Harish Rao: బూస్టర్‌ ఎప్పుడు?.. అనుమతిస్తే వేస్తాం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో ఎక్కువ జనాభా ఉన్న 18-59 మధ్య వయస్సు వారికి బూస్టర్‌ ఇవ్వడంలో ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం 12 ఏండ్లలోపు, 60 ఏండ్లు పైబడినవారికే టీకా వేసేందుకు అనుమతి ఇస్తున్నది. అనేక రాష్ట్రాల్లో టీకా నిల్వలు పేరుకుపోయినప్పటికీ 18+కు బూస్టర్‌పై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో మిగిలిపోయిన 32 లక్షల డోసులను ప్రభుత్వం ఆధ్వర్యంలో 18-59 ఏండ్ల మధ్యవారికి బూస్టర్‌ డోస్‌ వేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ ను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రాల్లో నిల్వ ఉన్న కోవిడ్‌ టీకాల కాల పరిమితి ముగుస్తున్న నేపథ్యంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

బూస్టర్‌ డోస్‌కు అనుమతివ్వాలంటూ హరీశ్‌రావు గతంలోనూ కేంద్రానికి రెండు సార్లు లేఖ రాసిన సంగతి తెలిసిందే. నిక్షయ్‌ మిత్ర క్యాంపెయిన్‌, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్‌, హర్‌ ఘర్‌ దస్తక్‌ క్యాంపెయిన్‌ -2.0పై కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయం నుంచి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్‌ గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు, సూచనలు చేశారు. ప్రస్తుతం 60 ఏండ్లకుపైబడిన వారికి మాత్రమే ప్రభుత్వం ఉచితంగా ప్రికాషనరీ డోస్‌ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించిందని, 18-59 ఏండ్ల వయస్కులకు ప్రైవేట్‌ దవాఖానల్లో బూస్టర్‌ డోస్‌ వేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల వాక్సిన్‌ డోసులు నిల్వ ఉన్నాయని, వాటి గడువు తేదీ ముగియకముందే ప్రికాషనరీ డోస్‌ వేసేందుకు అనుమతివ్వాలని కోరారు.

రాష్ట్రంలో వాక్సినేషన్‌ వేగంగా జరుగుతున్నదని మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఇంటింటికీ వ్యాక్సినేషన్‌లో భాగంగా పదిరోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 12 ఏండ్లకు పైబడినవారికి మొదటి డోసు 104.78%, రెండో డోసు 99.72% పంపిణీ చేసినట్టు పేరొన్నారు.

కరోనా వ్యాప్తిని గమనిస్తూ నిర్ధారణ పరీక్షలు పెంచుతున్నట్టు తెలిపారు. టీబీ నిర్మూలనకు కేంద్రం అమలుచేస్తున్న నిక్షయ్‌ మిత్రను రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేస్తామని చెప్పారు. కంటి ఆపరేషన్లు మరింత పెంచేలా టీచింగ్‌ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల్లో పాకో మిషన్లు సమకూర్చి, లక్ష్యం చేరుతామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం డైరెక్టర్‌ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీహెచ్‌ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

• ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి.
• 32 లక్షల డోసుల నిల్వ ఉంది, గడువు తేదీ ముగిసే అవకాశం ఉంది.
• రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్.
• ఇంటింటికి వాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడి. pic.twitter.com/6uUTYeDIem

— Harish Rao News (@TrsHarishNews) June 13, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • booster dose
  • Centre
  • Delay
  • near expiry
  • stock

తాజావార్తలు

  • DrivingLicense: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి షాక్.. ఇకపై ఆ టెస్ట్ పాసైతేనే ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు!

  • Karishma Tanna: 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్.. బేబీ బంప్‌ ఫొటోలు వైరల్..

  • Leander Paes: బీజేపీలో చేరిన వారానికే లియాండర్ పేస్‌‌కు ఎక్స్ కేటగిరీ భద్రత.. రాజకీయ పార్టీలు ఆశ్చర్యం

  • Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions