Elevated Corridors: తెలంగాణకు175 ఎకరాల రక్షణ భూమి.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elevated Corridors: కేంద్ర రక్షణ శాఖ 175 ఎకరాల రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీంతో రోడ్లు, ఎలివేటర్ కారిడార్ల నిర్మాణంలో ఇబ్బందులు తొలగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 5న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలంగాణ సీఎంవో తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రక్షణ శాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరగా కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని సీఎంఓ వివరించారు. తమ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Read also: Yadagirigutta: యదాద్రి ఇకపై యాదగిరిగుట్ట..! పేరు మార్చేందుకు కాంగ్రెస్ ఆలోచన..?
Also Read
రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గాను కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 44వ నెంబరు జాతీయ రహదారి (కామారెడ్డి మార్గం), రాష్ట్ర రహదారి నంబర్ 1లో ఎలివేటెడ్ కారిడార్లు, సొరంగాల నిర్మాణం సులభతరం కానుందని కిషన్ రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజా జీవనాన్ని సులభతరం చేస్తామని పదేళ్లుగా దేశ ప్రజలకు అందిస్తున్న హామీకి ఇదో ఉదాహరణ అని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండలను కలుపుతూ రాజీవ్ రహదారిపై నిర్మించనున్న 11.3 కిలోమీటర్ల పొడవునా ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందులో కొంత భూమి రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఈ విషయమై కేంద్ర రక్షణ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపడంతో.. కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం విశేషం.
Director Krish: రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీసుల విచారణకు క్రిష్
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!