NTV Telugu Site icon

Kishan Reddy: సెప్టెంబర్‌ 17.. హిందూ ముస్లింలకు సంబంధించిన కార్యక్రమం కాదు..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: బీజేపీ రంగులు మార్చే పార్టీ కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17… హిందూ ముస్లింలకు సబంధించిన కార్యక్రమం కాదని ఆయన వెల్లడించారు. మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన చరిత్రను తెలంగాణ మరవదన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ కోసం మాత్రమే పనిచేసాయని… దేశ సంస్కృతిని, త్యాగాలను చెప్పేందుకు ప్రయత్నించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Narendra Modi: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌కు ప్రధాని మోడీ ఫోన్‌.. ఆ అంశాలపై కీలక చర్చ

370 ఆర్టికల్ రద్దు చేస్తే రక్తపాతం జరుగుతుందని అన్నారని.. కానీ ఒక్క ఈగ, దోమ కూడా కదలలేదన్నారు. మోడీ నాయకత్వం పట్ల విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ నేతృత్వంలో కుటుంబ రాజకీయాలకు చరమ గీతం పాడుతామన్నారు. సెప్టెంబర్‌ 17న జరిగే కార్యక్రమానికి ముగ్గురు సీఎంలను ఆహ్వానించామని.. ఎవరెవరు వస్తారో మీకు తెలుసని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అందరూ రావాలని కోరుతున్నామని కిషన్‌రెడ్డి అన్నారు.