NTV Telugu Site icon

Telangana: నెంబర్ ప్లేట్లపై TS స్థానంలో TG.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

Ts Tg

Ts Tg

Telangana: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనకంటూ మార్క్‌ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా తీసుకున్న మరో కీలక నిర్ణయమే తెలంగాణ వాహనాల నెంబర్‌ ప్లేట్ల మీద టీఎస్‌ కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే గెజిట్‌ కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 15వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం నిన్న (గురువారం) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వాహనాలకు నెంబర్‌ ప్లేట్లపై టీఎస్‌ ను టీజీగా మార్చేందుకు కేంద్ర ఓకే చెప్పింది.

Read also: Nithish Reddy: తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డికి జాక్‌పాట్!

తెలంగాణ కోడ్..టీజీ ఉండే విధంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ విడుదల చేసింది. ఇక నుంచి వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం, సీరియల్ నంబర్ 29A కింద, TS బదులుగా TG గా మార్చడం జరిగింది. అంతకుముందు రేవంత్ రెడ్డి మంత్రివర్గం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మార్చి 12న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989 జూన్‌ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్‌ నంబర్‌ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇది వరకు ఉన్న టీఎస్‌ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్‌ కేటాయించినట్లు తెలిపింది. సీఎం రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ మార్క్‌లో మార్పు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం తమ పార్టీ అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో టీజీని కాదని టీఎస్‌గా నిర్ణయించిందని దానిని మార్చాలని తెలంగాణ కేబినేట్‌ తీర్మానం చేసింది. ఇకపై రిజిస్టర్‌ అయ్యే వాహనాల మార్క్‌ టీజీగా మారనుంది.ఇప్పుడు కేంద్రం ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి.. పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
SSMB29 : కాస్టింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..