Site icon NTV Telugu

TS Assembly Elections: నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. కలెక్టర్లు, ఎస్పీలతో కీలక భేటీ..?

Ts Assembly Elections

Ts Assembly Elections

TS Assembly Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగానే నేడు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

2018లో ముందస్తు ఎన్నికలు జరిగినప్పుడు కూడా అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ వచ్చి.. నవంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్‌లో పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఈసారి కూడా ఇంచుమించు అదే షెడ్యూల్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5-15 మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఈసీ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. తెలంగాణకు రానున్న సీఈసీ బృందం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించి పలు కీలక సూచనలు చేయనున్నారు. ఈవీఎంల పరిశీలన, ఓటర్ల తుది జాబితా తయారీ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి కూడా ఈరోజు హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు సీఈసీ బృందం హైదరాబాద్ లోనే మకాం వేసి కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీ శాఖ అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం రానున్నట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, డబ్బు పంపిణీని అరికట్టడం, ఎన్నికల సమయంలో కొట్లాటలు, దాడులు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై పోలీసు అధికారులతో చర్చించనున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు విజయకేతనం ఎగురవేస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలు రచించడంలో స్పీడ్ పెంచారు. అధికారిక BRS కొత్త అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం మరియు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని, సర్వేల ఆధారంగా గెలిచే వారికే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించింది. కానుగు సునీల్‌ని ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకుని టీ కాంగ్రెస్ సర్వేలు చేయిస్తోంది.
Revanth Reddy: నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్ రెడ్డి కీలక భేటీ

Exit mobile version