Site icon NTV Telugu

Election Commission: లావాదేవీల‌పై నిఘా పెట్టండి.. రాష్ట్రాల‌కు ఈసీ లేఖ‌

Election Commission

Election Commission

Election Commission: ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రూ.ల‌క్ష దాటిన లావాదేవీలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు ఈసీ లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా, డిపాజిట్ల వివరాలపై ఆరా తీయాలని సూచించారు. దేశవ్యాప్తంగా లోక్ సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు లేఖ రాశారు. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి రూ.లక్షకు పైగా లావాదేవీల వివరాలను తీసుకురావాలి.వాటిని విశ్లేషించే బాధ్యత సంబంధిత సిబ్బందికి అప్పగించాలి.ఎన్నికల సందర్భంగా ఒకే బ్యాంకు శాఖ నుంచి వివిధ బ్యాంకులకు నగదు బదిలీ అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

Read also: Arvind Kejriwal Arrested: అరెస్ట్‌ అయినా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించనున్న కేజ్రీవాల్

కాగా.. ఓట‌ర్లను ప్ర‌భావితం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా న‌గ‌దు లావాదేవీలు చేప‌ట్టే అవ‌కాశం ఉంది. రాజకీయ పార్టీల ఖాతాల నుంచి తీసుకునే లావాదేవీలను పర్యవేక్షించాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బ్యాంకు ఖాతాల నుంచి అతని భార్య, అభ్యర్థిపై ఆధారపడిన వ్యక్తి లక్షకు పైగా లావాదేవీలను అఫిడవిట్‌లో నమోదు చేయాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రెండు నెలల ముందు జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్‌ను ఖచ్చితంగా పర్యవేక్షించాలి. సంబంధిత వివరాలను ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారులకు అందజేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది.
Operation Valentaine OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Exit mobile version