Site icon NTV Telugu

పరీక్షా కేంద్రాల మార్పుకు అవకాశం

మొదటి సారి సీబీఎస్‌ఈ పరీక్షలు రాయనున్న10,12 తరగతుల విద్యార్థులకు పరీక్షా కేంద్రం మార్చుకోవడానికి సీబీఎస్‌ఈ బోర్డు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆయా స్కూళ్లను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది. కరోనా కారణంగా ఆయా స్కూళ్ల విద్యార్థులు గ్రామాలకు వెళ్లారు. వీరు తాము ఉన్న చోటు నుంచే పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో సీబీఎస్‌ఈని కోరారు. దీని పై స్పందించి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షాకేంద్రం మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది.

విద్యార్థులు ముందుగా ఆయా పరీక్షా కేంద్రాల మార్పుకు సంబంధించిన విషయాలను పాఠశాలలకు తెలియజేయాలి. అనంతరం ఆయా స్కూళ్లు ఆన్‌లైన్‌ ద్వారా బోర్డుకు సమాచారం ఇస్తాయి. దీనికి కొద్ది రోజులు మాత్రమే గడువు ఇవ్వనున్నట్టు సీబీఎస్‌ఈ పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు బోర్డుసైట్‌, స్కూళ్లను గమనించాలన్నారు. ఫస్ట్‌ టర్మ్‌ పరీక్షలు నవంబర్‌, డిసెంబర్‌లో జరగనున్నాయి.

Exit mobile version