NTV Telugu Site icon

Notices to MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు CRPC 91 నోటీస్.. ఎందుకు ఇస్తారు?

Mlc Kavitha

Mlc Kavitha

Notices to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా నిన్న హైదరాబాదులోని TRS MLC కవిత నివాసంలో సీబీఐ అధికారులు ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి అనేక వివరాలు సేకరించింది. అయితే.. నిన్న (సోమవారం) సుదీర్ఘ విచారణ తర్వాత.. సీబీఐ అధికారులు మరోసారి కవితకు సీఆర్పీసీ 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. దీంతో.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి.. కేవలం కేసుకు సంబంధించిన వివరణ కోసం మాత్రమే ఇవ్వగా, ఇప్పుడు సాక్షి దగ్గరున్న ఆధారాలు సమర్పించాలని సీఆర్పీసీ 91 కింద సీబీఐ అధికారులు నోటీసుల ద్వారా కోరినట్టు సమాచారం.

అయితే ,ఆ వివరాలు ఎప్పటివరకు సమర్పించాల్సి ఉంటుందన్న తేదీని మాత్రం ఇంకా చెప్పలేదు. ఈ సందర్భంగా.. ఈ నోటీసుల కింద సాక్షి దగ్గర కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలున్నా తమకు సమర్పించాలని అధికారులు కోరే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో సమర్పించిన ఆధారాలకు సంబంధించి అధికారులకు ఏమైనా సందేహాలుంటే మాత్రం మళ్లీ నోటీసులిచ్చి విచారించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈకేసులో కవితను ఇరికించే విధంగా ఆధారాలు అడిగితే మాత్రం కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

CRPC 91 ఎందుకు ఇస్తారు అంటే?

91 సీఆర్పీసీ ప్రకారం సీబీఐ చెప్పినచోట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే.. అడిగిన పత్రాలు, ఆధారాలు కచ్చితంగా సమర్పించాలి. ఇక ఈ నోటోసులు ఎవరు అందుకుంటే వాళ్లే హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో.. విచారణ తేదీ, స్థలం మెయిల్ ద్వారా తెలియజేస్తామని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఇక, ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అమిత్‌ అరోరా స్టేట్‌మెంట్‌ ఆధారంగా కవిత దగ్గర ఆధారాలున్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.

ఈ స్కామ్‌తో సంబంధమున్న 30 మంది కేసుకు సంబంధించిన ఆధారాలున్న 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అందులో కవితకు సంబంధించిన 10 మొబైల్స్‌ ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు విషయంలో కొంత సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కవిత దగ్గరున్న ఆధారాలను సమర్పించేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐతే ఆధారాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

అయితే.. 91 సీఆర్పీసీ సబ్‌క్లాజ్‌-2 ప్రకారమైతే..సీబీఐ ఆఫీసుకు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదని విశ్లేషకుల మాట. ఇక, మరోవైపు సీఆర్పీసీ 91 నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ఎలా స్పందిస్తారు..? దీంతో.. సీబీఐ అడిగిన ఆధారాలు సమర్పిస్తారా..? లేదా.. రెండోసారి చెప్పిన ప్లేస్‌కి విచారణకు వెళ్తారా..? లేదా ఆమె మళ్లీ న్యాయనిపుణుల సలహా తీసుకుంటారా..? అనే దానిపై బీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.