Site icon NTV Telugu

CAT : అతన్ని విధుల్లోకి తీసుకుంటారా? మిమ్మల్ని ఏపీకి పంపించాలా?

అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో విధుల్లోకి తీసుకోవాలని సీఎస్‌కు క్యాట్​ ఆదేశించింది. ఐపీఎస్​ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకోనందుకు సీఎస్‌పై క్యాట్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సీఎస్ సోమేశ్‌కుమార్‌పై అభిషేక్ మొహంతి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై క్యాట్ విచారణ జరిపింది. ట్రైబ్యునల్ విచారణకు సీఎస్ సోమేశ్‌కుమార్ వర్చువల్‌గా హాజరయ్యారు.

ట్రైబ్యునల్ ఆదేశాలతోనే సీఎస్‌ తెలంగాణలో కొనసాగుతున్నారని క్యాట్ వ్యాఖ్యానించింది. అవసరమైతే ఆదేశాలను పునఃసమీక్షిస్తామని సీఎస్‌కు ట్రైబ్యునల్ హెచ్చరించింది. ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి గతంలో క్యాట్‌లో పిటిషన్​ వేశారు. పరిశీలించిన క్యాట్​… అభిషేక్‌ను రిలీవ్ చేయాలని ఏపీని, విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణను ఆదేశించింది. అయితే విధుల్లోకి తీసుకోవడం లేదంటూ అభిషేక్ మొహంతి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.

Exit mobile version