Car Accident: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఫిలింనగర్ ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఓవర్ స్పీడ్ తో చెట్టు, ఎలక్ట్రికల్ పోల్, గోడని ఢీ కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. కారు రెండు టైర్లు విడిపోయి.. కొంత దూరంలో పడ్డాయి. కారును అక్కడే వదిలేసి.. తన హై హీల్స్ భుజాన వేసుకుని సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
Read also: Tomato Price: కొనసాగుతున్న టమాటా మోత.. రూ.250కు చేరుకునే అవకాశం
ఆదివారం రామానాయుడు స్టూడియో సమీపంలో ఓ ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టింది. అక్కడి నుంచి.. కరెంట్ స్తంభానికి తగిలింది. అది పూర్తిగా విరిగి కింద పడింది. ఆ తర్వాత గోడకు తగలడంతో అది కూలిపోయింది. అంతా మట్టి, రాళ్లు గుట్టలుగా పేరుకుపోవడంతో గోడకు తగిలి ఆగిపోయింది. ఆగకుంటే నేరుగా ఎదురుగా గుడిసెలోకి దూసుకెళ్లేదని స్థానికులు అంటున్నారు. ఇద్దరు వ్యక్తులు నివసించే గుడిసెకు ఒక అడుగు దూరంలో కారు ఆగింది. గుడిసెలో వాచ్‌మెన్ దంపతులు నివసిస్తున్నారు. కారు అదే స్పీడ్‌లో వెళ్ళి ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కారులో ఉన్న యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత కారు నుండి.. ఆ స్త్రీ బయటకు వచ్చి హై హీల్స్ భుజానికి తగిలించుకుని వెళ్ళిపోయింది. ఆ కారు ఎలక్ట్రిక్ కారు అని తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం నుంచి కారును పీఎస్‌కు తరలించారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో ఫిల్మ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Anasuya Bharadwaj : కాలిఫోర్నియా వీధులలో తిరుగుతూ స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
