డ్రగ్స్ కేసు హైదరాబాద్ ను కుదిపేస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉండడంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ డ్రగ్స్ పది మంది పరారీలో ఉన్నారని, పరారీలో నలుగురు బడా బిజినెస్ మేన్ లు సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్ గర్దపల్లి, అశోక్ జైన్ లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న బిజినెస్ మేన్ ల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు చూపెట్టగా.. పదిమంది పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇతర సహాయకులని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీతో పాటు ముఠా సభ్యులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్ టోనీ వ్యాపార నిమిత్తం 2009లో ముంబైకి వచ్చాడు. ముంబై నుంచి విగ్గులు, వస్తాలను నైజీరియాకు టోనీ ఎగుమతి చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ స్టార్ బాయ్ తో టోనీ కి పరిచయం ఉండడంతో షిప్ ల ద్వారా ముంబైకి డ్రగ్స్ ను టోనీ చెప్పించాడు. 2013 నుంచి డ్రగ్స్ మాఫీయా ను టోనీ నడుపుతున్నాడు. సంపాదించిన డబ్బు మొత్తాన్ని వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా నైజీరియాకు టోనీ పంపించాడు. అయితే ప్రస్తుతం జైలులో ఉన్న టోనీని 10 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్ వేశారు. టోనీని విచారిస్తే మరికొంతమంది బడాబాబుల బండారం బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
డ్రగ్స్ కేసు : పరారీలో నలుగురు బడా బిజినెస్ మేన్ లు
