NTV Telugu Site icon

Hyderabad: నగరానికి క్యూ కట్టిన జనం.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు, రైళ్లు..

Pantangi Plaza

Pantangi Plaza

Hyderabad: లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటు వేసేందుకు ఇళ్లకు వెళ్లిన వారంతా పోలింగ్ ముగియడంతో తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే ప్రయాణికులతో నగరంలోని మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నగరానికి చేరుకున్న ప్రయాణికులు తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు మెట్రో రైళ్ల వినియోగం పెరగడంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఎల్బీ నగర్-మియాపూర్ మార్గంలో మెట్రోలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చాలా మంది మెట్రో రైలులో నిలబడి ప్రయాణిస్తున్నారు. కొన్ని రైళ్లలో నిలబడేందుకు కూడా గ్యాప్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి ఓటర్ల తిరుగు ప్రయాణంతో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అరగంట ముందుగానే మెట్రో సర్వీసును ప్రారంభించారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ మెట్రో మరిన్ని ట్రిప్పులు నడపాలని యోచిస్తోంది.

Read also: Rajasthan : 1800అడుగుల కింద పడిపోయిన లిఫ్ట్.. గనిలో చిక్కుకున్న 150 మంది కార్మికులు

దీనికి తోడు కార్యాలయాలకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరగడంతో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారి ట్రాఫిక్‌తో కిటకిటలాడుతోంది. ఎన్నికలకు వెళ్లిన ఏపీ ప్రజలు మళ్లీ నగరానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజాలో 16 గేట్లు ఉండగా హైదరాబాద్ వైపు పది గేట్లు తెరిచారంటే రద్దీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 95 శాతం వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఉండడంతో వాటిని త్వరగా స్కాన్ చేసి పంపుతున్నారు. ఏపీకి వెళ్తే అదే జనం: ఏపీలో సోమవారం జరిగిన ఎన్నికలకు శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు పెద్ద ఎత్తున ఓటర్లు వెళ్లారు. దీంతో నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మళ్లీ తిరుగు ప్రయాణంలో కూడా ఈ ట్రాఫిక్ తప్పడం లేదు.
Tadipatri: పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం..