Site icon NTV Telugu

Courier Thief: మేడమ్ కొరియర్ వచ్చింది.. తలుపు తీస్తే అంతే సంగతి

Courier Thief

Courier Thief

దోపిడి దొంగల వ్యవహారం నగరంలో హద్దుమీరుతోంది. మహిళ మెడలోని టార్గెట్‌ చేస్తూ చైన్‌ స్నాచర్లు చేస్తున్న దొంగతనాలు నగరంలో హడలెత్తుతున్నాయి. ఇంటి తాళాలు వేస్తే చాలు దోపిడీకి పాల్పడుతున్నారు. ఎదో ఒకరూపంలో దొంగలు పకడ్బందీగా టార్గెట్‌ చేస్తూ వారిపని చేసుకుంటూ పోతున్నారు. పోలీసుల ఎంత అలర్ట్‌ చేస్తున్నా పోలీసులకు సైతం సవాల్‌ చేస్తూ.. దోపిడీలకు పాల్పడుతున్నారు. వాళ్లు ఇవ్వడానికి నిరాకరిస్తే కత్తితో నైనా తుపాకితో అయితే లేదా వారిపై దాడి చేసి ఇంట్లో, షాపుల్లో చొరబడి నగదు, నగలను దోచుకుపోతున్నారు. అయితే ఒకదొంగ చేసిన పనిమాత్రం విచిత్రంగా వుంది. కొరియర్‌ బాయ్‌ గా వచ్చి ఇంట్లో చొరబడి బంగారం దోచుకెళ్లాడు. ఈ ఘటన భాగ్యనగరంలో చోటుచేసుకుంది.

హైదరబాద్‌ లోని పేట్ బాషీరాబాద్ రామచంద్రరావు అనే భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. ఆమె ఒక్కటే ఇంట్లో ఉంది. అది గమనించిన దుండగుడు కొరియర్ వచ్చిందంటు ఇంటి తలుపు తట్టిన కేటుగాడు. అయితే బాదితురాలు మేము ఎలాంటి ఆర్డర్‌ పెట్టలేదని చెప్పేలోపే ఆ దుండుగుడు ఇంట్లోకి చొరపడ్డాడు. బాదితురాలు మెడపై కత్తిపెట్టి బెదిరించాడు. అరిస్తే చంపేస్తానని భయపెట్టడంతో.. ఆమె ఏమీ చేయలేకపోయింది. బాదితురాలి మెడలో మంగళసూత్రం తీసుకున్నాడు. ఆమోను చంపడానికి ప్రయత్నించడంతో.. బాదితురాలు తనని చంపొద్దని వేడుకోవడంతో.. చుట్టుపక్కన వారు అలర్ట్ అవుతారని భయపడి తనతో తెచ్చుకున్నా టేపును భాదితురాలి నోటికి చుట్టి పరారయ్యాడు. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త ఇంటి తలుపులు తెరిచివుండడంతో.. లోపలికి వెళ్లి చూడగా.. భార్య నోటికి టేపు వేసి వుండటంతో.. నిర్ఘంతపోయాడు.. టేపును తొలగించి ఏమైందని అడుగగా.. బాధితురాలు జరిగిన ఘటనను వివరించింది. దీంతో.. భర్త రామచంద్రరావు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
COVID 19: ఇండియాలో పదివేలకు పైగా కేసులు.. 13 వేల రికవరీలు

Exit mobile version