Site icon NTV Telugu

నేడు ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరు కానున్న బండి సంజయ్‌

ఇటీవ‌ల రాష్ట్రంలో బండి సంజ‌య్ ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ అరెస్టు.. ఇటు రాష్ట్రం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా బండి అరెస్టును వివిధ వర్గాలు ఖండించాయి. అయితే త‌న‌ను అరెస్టు చేసే స‌మ‌యంలో తెలంగాణ పోలీసులు క‌నీస నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని బండి సంజ‌య్ అరోపించారు. అంతే కాకుండా త‌న అరెస్టు వ్యవహారం పై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి కూడా ఎంపీ బండి సంజ‌య్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రోజు ఎంపీ బండి సంజ‌య్ పార్లమెంట్‌ ప్రివిలేజ్ క‌మిటీ ముందు హాజ‌రు కానున్నారు.

Read Also: రేపు, ఎల్లుండి కొన్ని ఎంఎంటీస్‌ రైళ్లు రద్దు

ఇందు కోసం గురువారం బండి సంజ‌య్ ఢిల్లీ కి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రివిలేజ్ క‌మిటీ ముందు ఎంపీ బండి సంజ‌య్ హాజ‌రు అవుతారు. తెలంగాణ పోలీసులు త‌న‌ను అరెస్టు చేసిన విధానాన్ని పార్ల‌మెంట్ ప్రివిలేజ్ క‌మిటీ తెలియ‌పరుస్తారు. కాగా ఉద్యోగుల బ‌దిలీ గురించి తెలంగాణ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన జీ వో నెంబ‌ర్ 317 ను స‌వ‌రించాల‌ని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజ‌య్ డిమాండ్ చేస్తు.. దీక్ష చేశారు. అయితే బండి సంజ‌య్ దీక్ష స‌మ‌యంలో క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

Exit mobile version