భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే శాఖ భూముల వ్యవహారంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నష్ట పరిహారం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధిత కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మణుగూరు మండలం రామానుజవరం బీటీపీఎస్ కోసం రైతుల భూముల ను బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కుంటున్నారని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెవిన్యూ అధికారులు లేకుండా భూములు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు, జెన్కో అధికారులు ఎలా వస్తారని బాధితులు వాపోయారు. రైల్వే అధికారుల తీరుపై బాధితులు ఆందోళన చేశారు.రైల్వే లైన్ నిర్మాణం కోసం జేసీబీతో పంటలు ధ్వంసం చేస్తుండడంతో రాజేష్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేసాడు. రైతులపై విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేశారని బాధితులు అంటున్నారు. మహిళల పట్ల కూడా పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
